Headlines

Bigg Boss Telugu 10: కింగ్‌తో మాములుగా ఉండదు.. బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్


బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 10తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ కానుంది. గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ షో మరింత కలర్ ఫుల్ గా ఉండనుంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ రియాలిటీ షో ప్రారంభమై పదేళ్లయ్యాయి. అందుకే  ల్యాండ్ మార్క్ సీజన్ కోసం మరిన్ని హంగులు దిద్దనున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి గేమ్స్, టాస్క్‌లు.. ఇలా అన్ని విషయాల్లోనూ ‘అంతకు మించి’ అని ఉండేలా బిగ్ బాస్ సీజన్ 10 కు ఏర్పాట్లు చేశారు. ఇక బిగ్ బాస్ షోకు అసలైన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున అని చెప్పవచ్చు. బిగ్ బాస్ తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు తన దైన హోస్టింగ్ తో, స్టైల్‌తో, వీకెండ్ క్లాసులతో బిగ్ బాస్ షోను టాప్ లో నిలుపుతున్నారు.

నిజం చెప్పాలంటే నాగార్జున ఎంట్రీ ఇచ్చాకే ఈ రియాలిటీ షో మరింత రక్తి కట్టింది. టీఆర్పీ పరంగానూ అగ్రస్థానంలో నిలిచింది. నాగ్ హోస్ట్ చేసిన అన్ని సీజన్స్ టాప్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. గత 7 సీజన్ల మాదిరిగానే పదో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున రూ.35 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారని సమాచారం. అయితే ఈ ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం నాగ్ తన రెమ్యునరేషన్ ను పెంచినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన ఏకంగా రూ. 35 కోట్ల  నుంచి రూ. 40 కోట్ల పైగా ఫీజు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం టెలివిజన్ హిస్టరీలోనే ఒక టీవీ షో హోస్టింగ్‌కు ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న హోస్ట్ నాగార్జునే అవుతారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కానుంది. గత సీజన్ లానే ఈసారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేశారు. అగ్నిపరీక్ష ద్వారా కొందరిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. ఇప్పటికే సింగర్ జాన్సీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయిపొయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *