అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి , దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో ఇవాళ, సోమవారం, మంగళవారం.. వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం : –
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి , తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ;-
ఆదివారం సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది.
రాయలసీమ:-
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణలో వర్షాలు..
ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం, సోమవారం ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. తెలంగాణలోని మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..