‘కోర్టు’ సినిమాతో హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోషన్-శ్రీదేవి. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలోనూ ఈ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా హాజరయ్యారీ జంట. ఈ క్రమంలోనే రోషన్- శ్రీదేవిని హీరో, హీరోయిన్లుగా పెట్టి తీసిన మరో సినిమా ‘బ్యాండు మేళం’. సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించడం విశేషం. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్డ్రాప్లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. పాటలు, గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. అయితే మార్చి 26న థియేటర్లలో విడుదలైన బ్యాండ్ మేళం సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. రోషన్-శ్రీదేవిల జంట కెమిస్ట్రీ ఆకట్టుకున్నా కథ, కథనాలు మరీ నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజైన నెలలో బ్యాండ్ మేళం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.
బ్యాండ్ మేళం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియలో సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పంచుకుంటూ.. ‘బ్లాక్ బస్టర్ పెయిర్ మళ్లీ రాబోతుంది. మీరు మెచ్చిన జంట మరోసారి దరువు వేయబోతుంది. రిథమ్ కు మీరు రెడీనా? ఏప్రిల్ 24న బ్యాండ్ మేళం ప్రీమియర్ కేవలం జీ5లో మాత్రమే’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ మూవీలో సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో నిరాశ పర్చిన బ్యాండ్ మేళం ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
జీ5లో బ్యాండ్ మేళం స్ట్రీమింగ్
Blockbuster Pair is back with a BANG!
Meeru mecchina janta maro sari daruveyabothunnaru!
Are you ready for the rhythm?Watch #BandMelam
premieres April 24th, only on ZEE5.@HarshRoshan7 @SrideviActor @saikumaractor@konavenkat99 @SathishJavvaji @VijaiBulganin pic.twitter.com/sX3U0uwp99— ZEE5 Telugu (@ZEE5Telugu) April 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.