శని గ్రహం ఏప్రిల్ 17 శుక్రవారం రోజున నక్షత్ర సంచారం చేస్తుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని నాలుగవ పాదంలోకి ప్రవేశిస్తుంది. దీని వలన ఏప్రిల్ 18 నుంచి నాలుగు రాశుల వారు మే 17 వరకు అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. చాలా వరకు ధననష్టం జరుగుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఏ పని చేయాలి అన్నా కలిసి రాదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్యారాశి : కన్యారాశి వారు ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి అధికం అవుతుంది. ఇతరులతో మాట పట్టింపులు వస్తాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చాలా సమస్యలు ఏర్పడుతాయి. అందువలన ఈ సమయంలో మీరు చాలా సహనంగా ఉండటం మంచిది.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందదు. వ్యాపారంలో నష్టాలు చూస్తారు. పెట్టిన పెట్టుబడులకు లాభం రాక చాలా ఇబ్బంది పడతారు. అంతే కాకుండా కుటుంబ సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి.
కుంభ రాశి : కుంభ రాశి వారికి కుటుంబంలో గొడవలు మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. చాలా ఒత్తిడికి లోను అవుతారు. వ్యాపార పరంగా అనేక నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉండదు. కష్టపడి పని చేసినా దాని గుర్తింపు ఉండదు, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి.




