Indian Railways: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే ‘లోయర్ బెర్త్’ కన్ఫర్మ్.. ఇందులో నో డౌట్‌..!

Indian Railways: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే ‘లోయర్ బెర్త్’ కన్ఫర్మ్.. ఇందులో నో డౌట్‌..!


Train Lower Berth: సుదూర రైలులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. వారితో పాటు వృద్ధులు లేదా చిన్నపిల్లలు ఉంటే చాలామంది లోయర్ బెర్త్ సీటు కావాలని కోరుకుంటారు. అయితే అందరికీ లోయర్ బెర్త్ సీటు లభించదు. అందువల్ల వృద్ధులు, మహిళలు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు లోయర్ బెర్త్ సీటును ఎలా పొందాలో తెలియదు. అయితే ఈ ఒక్కపని చేస్తే చాలు సులభంగా బెర్త్‌ లభిస్తుంది.

రైలు టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు చాలా మందికి మధ్య బెర్త్ లేదా పై బెర్త్‌లో సీటు లభించడం తరచుగా కనిపిస్తుంటుంది. ఈ సందర్భంలో ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకోవడంలో ఒక చిన్న పొరపాటు చేసి ఉంటారు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికుల కోసం కింది బెర్త్‌లో ఒక నిర్దిష్ట కోటా కేటాయించారు. ఈ కేటాయింపు లేదా కోటా స్లీపర్, ఏసీ కోచ్‌లకు వేర్వేరుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Akshaya Tritiya: మహిళలకు గుడ్‌న్యూస్‌.. 50 శాతం తగ్గింపుతో మతిపోగొట్టే ఆఫర్‌!

ఇవి కూడా చదవండి

లోయర్ బెర్త్ ఎలా పొందాలి?

పురుష ప్రయాణికుడి వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా లేదా మహిళా ప్రయాణికురాలి వయస్సు 58 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా, టిక్కెట్ బుక్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీనియర్ సిటిజన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీనికి అదనంగా 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు సీటు ప్రాధాన్యతలో లోయర్ బెర్త్‌ను కూడా ఎంచుకోవచ్చు.

రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక PNR లేదా టిక్కెట్‌లో గరిష్టంగా 1 లేదా 2 మంది సీనియర్ సిటిజన్లు మాత్రమే లోయర్ బెర్త్ సౌకర్యాన్ని పొందగలరు.

ఒకే టిక్కెట్టుపై 4-5 మంది సీనియర్ సిటిజన్ల కోసం టిక్కెట్లు కొనుగోలు చేస్తే అందరికీ లోయర్ బెర్త్ దొరికే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.

అయినప్పటికీ టిక్కెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్‌లన్నీ అప్పటికే నిండిపోయి ఉంటే లోయర్ సీట్లు అందుబాటులో ఉండవు.

గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక కోటా ఉంది. ఆ కోటా నిండిపోతే కింది బెర్త్‌లో సీట్లు అందుబాటులో ఉండవు.

ఎవరైనా ఏ కారణం చేతనైనా తమ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే సిస్టమ్ స్వయంచాలకంగా దిగువ బెర్త్‌లో సీటును కేటాయిస్తుంది.

ఇది కూడా చదవండి: Akshay Tritiya: అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం, వెండి ధరలపై కేంద్రం బిగ్ డెసిషన్‌.. పసిడి దిగివస్తుందా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *