
KTR: ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ సాధించిన పార్టీగా.. రెండుసార్లు అధికారంలో ఎన్నో పనులు చేసిన బీఆర్‌ఎస్.. రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. 2023 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశారంటూ మొన్నటిదాకా ఆ పార్టీ నేతలు వాదించారు. కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు తప్పు చేశారంటూ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలందరిదీ ఇదే మాట. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ నేతల ఆలోచన మారింది. ప్రజలను నిందించడం సరికాదంటూ కేడర్‌కు హితబోధ చేశారు కేటీఆర్.. ప్రజలు రెండుసార్లు…