
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పెద్ద శేష వాహనంపై శ్రీనివాసుడు.. గోవిందా నామాస్మరణతో మారుమ్రోగిన మాడ వీధులు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పెద్దశేష వాహనసేవలో పాల్గొన్నారు శ్రీవారు. భూదేవి-శ్రీదేవి సమేత మలయప్పస్వామిగా.. పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో…