Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్
ఇటీవల కాలంలో వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్లు సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా వారాల తరబడి డెలివరీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 12 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే వారం రోజుల క్రితమే తన సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్‌కు OTP మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవానికి సిలిండర్ మాత్రం…