
ఇంట్లోకి చొరబడి ఐదేళ్ల బాలుడిని నరికి చంపిన దుండగుడు.. పారిపోయేందుకు యత్నించగా.. !
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. వరుస దెబ్బలతో ఆ చిన్నారిని మూడు ముక్కలుగా నరికాడు. తల్లిదండ్రులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేకపోయాడు.. హత్య తర్వాత పారిపోతున్న నిందితుడిని గ్రామస్తులు పట్టుకున్నారు. అతన్ని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. కుక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో హంతకుడు…