ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య.. నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అడవి బిడ్డల అనుబంధం: గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు….