Headlines

rajeshchukka117@gmail.com

Aadhaar Card: ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలా..? జీవితకాలంలో మొత్తం ఎన్నిసార్లు మార్చకోవచ్చంటే..?

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాల దరఖాస్తు నుంచి ప్రైవేట్ హోటల్ రూమ్స్‌లో ప్రవేశం వరకు ఎక్కడైనా సరే.. ముందుగా దీనినే అడుగుతారు. ఇది అందించకుండా ఎలాంటి సేవలు మీరు పొందలేరు. ఆధార్ కార్డుకు అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే.. నిరంతరం మన జేబుల్లో ఉంచుకోవాల్సి వస్తోంది. అయితే ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆధార్ కార్డులో ఒకలా.. ఎడ్యుకేషన్…

Read Full News

అమెరికాలో మంటల్లో విమానం..ఐదుగురు మృతి.. వీడియో ఇదిగో!

ప్యూర్టోరికో నుంచి వచ్చిన ఒక విమానం మయామి విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో రన్‌వేపై అకస్మాత్తుగా అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయిన అమెజాన్ కార్గో విమానం రన్‌వే పక్కనే ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లి అక్కడ తిరుగుతున్న వాహనాలను తీవ్రంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే  విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.  స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మయామీ ఎయిర్…

Read Full News

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీలో నం.1 ఇషాన్ కిషన్, నం.3 వైభవ్ సూర్యవంశీ.. టాప్ 5 ప్లేయర్లు వీళ్లే

Duleep Trophy 2026: చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో సత్తా చాటారు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడుతూనే, సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మ్యాచ్ సమయంలో 160కి పైగా పరుగులు చేసి క్రీజులో నిలిచిన ఆయన, డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 200 పరుగుల…

Read Full News

WorldCup2027: 2027 వరల్డ్ కప్‌లో ఆ స్టార్ బౌలర్ కచ్చితంగా ఉండాల్సిందే.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ విజ్ఞప్తి

WorldCup2027: భారత జట్టుకు విశేష సేవలందించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు 2027 వన్డే ప్రపంచకప్‌లో అవకాశం కల్పించాలని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా డిమాండ్ చేశారు. ఐపీఎల్ తో పాటు ఇటీవల ముగిసిన యూపీ టీ20 లీగ్‌లో భువీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు భువీ పేరును పరిశీలించాలని రైనా సూచించారు. అక్టోబర్-నవంబర్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆయా దేశాల్లో ఉండే వేగవంతమైన,…

Read Full News

చెవి నొప్పి వస్తే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

చెవిలో నిరంతర దురద, నొప్పి, నీరు, ఇతర ద్రవాలు కారడం, వినికిడి తగ్గడం వంటి లక్షణాలను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. అధిక తేమ ఉన్న వాతావరణం బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అనుకూలంగా మారుతుంది. అందుకే వర్షాకాలంలో చెవులను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి? ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎన్‌టీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అభినీత్ కుమార్ ప్రకారం.. చెవి చాలా సున్నితమైన…

Read Full News

వేరే సినిమాకోసం చేసిన ఆ పాటను కృష్ణ సినిమాలో పెట్టారు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యింది

సీనియర్ దర్శకుడు సాగర్, తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణగారితో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన, సవాలుతో కూడిన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, కృష్ణగారితో కలిసి పనిచేసిన “నాయుడు గారి అబ్బాయి”, “కిరాయి కోటిగాడు” చిత్రాల విశేషాలు, అలాగే “అమ్మదొంగ” సినిమాకు సంబంధించిన నేపథ్యాన్ని ఆయన వివరించారు. సాగర్ తన సినీ జీవితాన్ని కృష్ణగారితో “నాయుడు గారి అబ్బాయి” చిత్రానికి అసోసియేట్‌గా ప్రారంభించారు….

Read Full News

ఒక్కట్రెండు సార్లు వేసుకుని బట్టలు పారేస్తున్నారా?.. ఇలా కొత్త లుక్‌లోకి మార్చేయండి

మనం కొన్న ప్రతి దుస్తులను ఒకటి రెండుసార్లు ధరించి పారేయడం వల్ల డబ్బు వృథా కావడమే కాకుండా వస్త్ర వ్యర్థాలు కూడా పెరుగుతాయి. ఒకే దుస్తులను వివిధ సందర్భాలకు అనుగుణంగా ధరించడం, వాటి నాణ్యతను కాపాడుకోవడం ద్వారా ఖర్చును తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేయవచ్చు. జూలియట్ అప్పారెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృతిక్ ట్రెవాడియా సూచించిన కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే దుస్తుల మన్నికను పెంచుకోవచ్చు.. ఉతికేటప్పుడు సూచనలు తప్పక పాటించండి ప్రతి వస్త్రానికి ప్రత్యేకమైన…

Read Full News

పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా.. నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు వెనక్కి..

డిజిటల్ చెల్లింపుల యుగంలో మొబైల్ రీఛార్జ్ చేయడం సెకన్ల పనిగా మారింది. అయితే కొన్నిసార్లు తొందరపాటులోనో లేదా అజాగ్రత్త వల్లనో ఒక అంకె తప్పుగా నమోదై, వేరే ఎవరికో రీఛార్జ్ అయిపోతుంటుంది. డబ్బులు కట్ అయ్యాక గానీ మనకు ఆ విషయం తెలియదు. ఇలాంటి సమయాల్లో చేతులెత్తేసి ఆందోళన చెందకుండా.. వెంటనే అప్రమత్తమైతే తప్పు నంబర్‌కు వెళ్లిన సొమ్మును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, ప్రక్రియలు తెలుసుకోవడం ఎంతో…

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ లేనివారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రిజిస్ట్రేషన్ ఛాన్స్.. అప్పటివరకే డెడ్ లైన్..

మీరు చాలా ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా.. మీకు పీఎఫ్ అకౌంట్ లేదా..? కంపెనీ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల మీరు పీఎఫ్ సదుపాయం పొందలేకపోయారా..? అయితే మీకు శుభవార్త. మీరు ఇప్పుడు పీఎఫ్ పరిధిలో చేరవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అదే ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్(ఈఈసీ) 2026 స్కీమ్. సాంకేతిక కారణాల వల్ల పీఎఫ్ పరిధిలో చేరనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. అక్టోబర్ 31…

Read Full News

El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..

సాధారణంగా వానకాలం సీజన్‌లో ఈ సమయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పచ్చని పైర్లతో కళకళలాడాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాల్లో నీటి కొరత మొదలైంది. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన మడి, ఇవాళ తడారిపోయి కనిపిస్తోంది. ఒక్కో మడి చొప్పున ఎండిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా.. పెరిగిన అన్నదాతల కష్టాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాన కాలంలో19.41 లక్షల ఎకరాల…

Read Full News