
Navaratri 2nd day: నేడు గాయత్రిదేవిగా దుర్గమ్మ దర్శనం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు
దేవీ నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల తదియ నాడు కదంబవనవాసిని అయిన ఆ పరమేశ్వరి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులతో పూజలను అందుకుంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ నవరాత్రులలో రెండో రోజున చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో కాషాయం రంగు లేదా కనకాంబరం చీర ధరించి అత్యంత సుందరంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆదిశంకరాచార్యులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని దర్శినంత మాత్రానే…