TG Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం!
హైదరాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు మొదలవుతాయి. విద్యార్ధులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. 5 నిమిషాలు గ్రేస్ టైం ఉంటుందని.. 9.05 గంటలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. హాల్‌టికెట్ ఉంటేనే అనుమతిస్తామని, లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది….