పోలీస్ స్టేషన్‌లో యువకుడి హైడ్రామా.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పరుగులు..!
మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాప్రసాద్ అనే యువకుడు గత కొద్దిరోజులుగా ఓ యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలపై రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలపై…