
Ladakh: లడఖ్‌లో రాష్ట్ర హోదా కోసం ఉద్యమం.. సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అరెస్ట్
రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అరెస్టు అయ్యారు. రెండు రోజుల క్రితం లడఖ్‌లో చోటుచేసుకున్న హింసలో నలుగురు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించే వ్యాఖ్యలు చేసి గుంపును రెచ్చగొట్టారు అనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ను ఆరెస్ట్ చేశారు. కాగా ఈ కారణం చేత అరెస్ట్ అవ్వడానికి నేను సంతోషిస్తాను అని వాంగ్‌చుక్ ఒకరోజు ముందే ప్రకటించడం గమనార్హం….