వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో శనీశ్వరుడు, పంచమంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం కారణంగా ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు తొల గిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యో గాలపరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.