Jananayagan: విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’ మూవీ..

Jananayagan: విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’ మూవీ..


ఓ పక్క ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా తిరుగుతున్న విజయ్‌ దళపతికి మరో బిగ్ ఝలక్ తగిలింది. ఇప్పటికే లీకై నెట్టింట వైరల్ అవుతున్న జననాయగన్ సినిమాని ఏకంగా ఓ కేబుల్ టీవీ ఆపరేటర్‌.. తన సర్కిల్లో ప్రదర్శిండం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. దాంతో పాటే విజయ్‌ ఫ్యాన్స్‌కు కోపం వచ్చేలా… సీన్‌లోకి పోలీసులు ఎంటర్‌ అయ్యేలా చేసింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన జననాయగన్ మూవీ.. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో ఈ మూవీ రిలీజ్‌ కోసం మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్‌ సినిమాను తమిళ తంబీలకు చూపించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే జననాయగన్ మూవీ నెట్టింట లీకైంది. ఇక ఈ లీక్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో ఈ మూవీ మేకర్స్‌ తలమునకలై ఉండగా… కోయంబత్తులోని కరుమత్తంపట్టిలో.. రాశి కేబుల్ టీవీ ఆపరేటర్‌ ఏకంగా జననాయగన్ లీక్‌డ్‌ వెర్షన్‌ ను తన కేబుల్ నెట్‌వర్క్‌లో ప్లే చేశాడు. ఏప్రిల్ 11న తన లోకల్ ఛానెల్లో జననాయగన్ సినిమాను పళనిసామి ప్రదర్శించాడు. అయితే ఇది గమనించిన టీవీకే కార్యకర్తలు.. విజయ్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. సదర్ కేబుల్ ఆపరేటర్ మీద పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం

Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *