AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి


అమరావతి, ఏప్రిల్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం విద్యాశాఖ ఫలితాలు విడుదల చేయనుంది. గురువారం (ఏప్రిల్‌ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్‌, లీప్‌ యాప్‌ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఒకే ఒక్క క్లిక్‌తో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు.

ఏపీ పదో తరగతి 2026 ఫలితాల కోసం ఈ కింది వెబ్‌సైట్‌ లింక్‌లపై క్లిక్‌ చేయండి.

కాగా ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఫలితాలను విడుదల చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా హెడ్‌మాస్టర్లు ఫలితాలను స్కూల్ లాగిన్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు వారి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు పొందొచ్చు.‘LEAP’ మొబైల్ యాప్ ద్వారా, డీజీలాకర్‌ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

మరోవైపు తెలంగాణలో బుధవారం (ఏప్రిల్ 29) పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఏకంగా 95.15 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. వీరికి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మొదటి వారంలో 5వ తేదీ నుంచి మొదలు కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *