అదితి మ్యాకల్ పాప పి సుశీల, ముద్దపప్పు ఆవకాయ్, పాష్ పోరీస్ వంటి ప్రాజెక్టుల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అర్జున్ రెడ్డితో పాటు అమీ తుమీ, రాధ, మిఠాయ్, దెబ్బకు ఠా.. దొంగల ముఠా, నేనులేని నా ప్రేమకథ వంటి చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించిన అదితి, ఎక్కువగా సహాయక పాత్రల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.