1992లో మలయాళ చిత్రం ‘సర్గం’తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రంభ.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.