ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో ఉన్న శుక్రుడు డిసెంబర్ 3 నుంచి ఒంటరిగా సంచారం సాగిస్తాడు. ఇంత వరకూ శుక్రుడితో కలిసి ఉన్న బుధ గ్రహం రాశి మారడంతో శుక్రుడు జనవరి 2 వరకు తన స్వస్థానంలో ఒంటరి సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు శుక్రుడి బలం మరింత పెరిగి స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు తులా రాశిలో సంచారం చేయడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం గడించడం, విలాస జీవితం అనుభవించడం వంటివి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశుల జీవితాల్లో చోటు చేసుకుంటాయి.