Headlines

జెన్సన్ రీఎంట్రీతో వైభవ్ దూకుడు.. వైరల్‌గా మారిన ఐస్‌లాండ్ క్రికెట్ పోస్ట్..!


Vaibhav Sooryavanshi: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈ బౌలింగ్‌ను ఊచకోత కోసిన చిన్నోడు వైభవ సూర్యవంశీపై ఐస్‌లాండ్ క్రికెట్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అతడి బ్యాట్‌లో ఎన్విడియా చిప్స్ ఏమైనా ఉన్నాయా అని చమత్కరించింది. ఈ సందర్భంగా ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునరాగమనాన్ని ప్రస్తావించింది.

రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో మంగళవారం గ్రూప్-బీ మ్యాచ్‌లో తిలక్ సేన యూఏఈని 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వైభవ్ కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇందులో 28 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉండటం విశేషం.

ఈ నిర్దాక్షిణ్య బ్యాటింగ్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ చేసిన పోస్టు ఆకట్టుకుంటోంది. “ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్స్ తిరిగి రావడం అనుకోకుండా జరిగినవి కాకపోవచ్చు..!” అని రాసుకొచ్చింది.

దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. “మీరింకా నయం.. అతడి బ్యాట్‌లో ఏఐ చిప్స్ ఉన్నాయంటున్నారు. కొందరైతే.. అతడే ఏఐ అంటున్నారు. దీనికి జెన్సనే బాధ్యుడు” అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

గంగూలీ ప్రశంసలు..

ఈ బ్యాటర్‌పై క్రికెట్ ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “వైభవ్ మంచి ఆటగాడు. ఈ వయసులోనే ఐపీఎల్‌లో కూడా బాగా ఆడాడు. అతడికి గొప్ప భవిష్యత్తు ఉంది. భారత్ తరపున అతడికి లభించిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే అతడికి ఎవరితోనూ పోలిక తేవొద్దు. సొంతంగా ఎదగనివ్వాలి” అని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సూచించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *