Actress: 60 ఏళ్లలో 1500లకు పైగా సినిమాలు.. స్టార్ హీరోలనే రఫ్పాడించిన నటి.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Actress: 60 ఏళ్లలో 1500లకు పైగా సినిమాలు.. స్టార్ హీరోలనే రఫ్పాడించిన నటి.. ఎవరో గుర్తుపట్టారా.. ?


పైన ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.. ? దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె తనదైన ముద్ర వేసింది. 60 ఏళ్ల సినీ ప్రయాణంలో 1500లకు పైగా సినిమాల్లో నటించారు. అలాగే 5000 రంగస్థల ప్రదర్శనలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో (అన్నాదురై, ఎం.జి. రామచంద్రన్, కరుణానిధి, జయలలిత మరియు ఎన్.టి. రామారావు) కలిసి నటించిన అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. నటిగానే కాకుండా ఆమె సుమారు 300 పాటలకు నేపథ్య గాయనిగా కూడా వ్యవహరించారు. ఆమె మరెవరో కాదు దివంగత సీనియర్ నటి మనోరమ. అసలు పేరు గోపిశాంత. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి తరతరాల అభిమానుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. 12 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించిన మనోరమ, ఐదు వేలకు పైగా వేదికలపై నటించిన ఘనతను సాధించారు. నాటకరంగంలో ఆమెకున్న అనుభవం, ఆమె సినీ జీవితానికి గొప్ప పునాది వేసింది. ఆమె ‘వైరం నాటక సభ’లో నటిస్తున్నప్పుడు, దాని యజమాని తిరువారూర్ గో. కళ్యాణసుందరం, ఆమె పేరును గోపిశాంత నుండి ‘మనోరమ’గా మార్చారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

ఆమె తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, సింహళ భాషలతో సహా ఆరు భాషలలో 1500కు పైగా చిత్రాలలో నటించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైంది. “దిల్లన మోహనబాల్”, “అన్బే వా”, “చిన్న గౌండర్” వంటి చిత్రాలలో ఆమె పోషించిన పాత్రల నటన గురించి విస్తృతంగా చర్చ జరిగింది. భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ (2002) ఆమెకు లభించింది. ‘పుడియ పాత’ చిత్రంలో తన నటనకు గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆమె పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

సినీరంగంలో ఓ వెలుగు వెలిగినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం కష్టాలతో నిండి ఉంది. తాను పనిచేసే నాటక సంస్థలో ప్రసిద్ధ నటుడైన ఎస్.ఎం. రామనాథన్‌తో మనోరమ ప్రేమలో పడి, తన తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా అతడిని వివాహం చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ప్రాణానికి ప్రమాదం ఉంటుందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడని రామనాథన్ ఆ బిడ్డను పుట్టిన కొద్దికాలానికే వదిలిపెట్టాడు. మనోరమ తండ్రి కూడా ఆమెను వదిలేశాడు. తీవ్రంగా కుంగిపోయిన మనోరమ, పునర్వివాహం చేసుకోకూడదని, తన కొడుకు భూపతిని ఒంటరిగా పెంచాలని నిర్ణయించుకుంది.అలాగే చివరి వరకు ఒంటరిగానే తన కుటుంబం కోసం జీవించింది. ఆమె ఎన్టీఆర్, రాజశేఖర్ వంటి హీరోల సినిమాల్లో నటించింది. ఆమె అనారోగ్యంతో 2011 అక్టోబర్ 11న తుదిశ్వాస విడిచారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

Manorama Movies

Manorama Movies

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *