హిప్పోల మెడ మీద వేలాడిన కత్తి.. కొలంబియా నిర్ణయంపై అంబానీ స్పందన

హిప్పోల మెడ మీద వేలాడిన కత్తి.. కొలంబియా నిర్ణయంపై అంబానీ స్పందన


హిప్పోల జనాభాను నియంత్రించాలని కొలంబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 80 హిప్పోలను చంపివేయాలని ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు. కొలంబియాలోని మగ్దలీనా నదీ పరివాహక ప్రాంతంలో నీటి ఏనుగుల వల్ల అక్కడి జీవవైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థకు హాని కలుగుతుండటంతో వాటిని చంపేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాటివల్ల ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హిప్పోలు దక్షిణ అమెరికాకు చెందినవి కావు. వీటిని అప్పట్లో డ్రగ్స్‌ వ్యాపారి ఎస్కోబార్‌ ఆఫ్రికా నుంచి తీసుకువచ్చి తన సొంత జూలో ఉంచాడు. అనంతరం ఎస్కోబార్‌ను అరెస్టు చేయడంతో అతని అధ్యాయం ముగిసింది. హిప్పోల సంరక్షణను ఎవరూ పట్టించుకోకపోవడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నాయి. వీటి సంతతి బాగా పెరగడంతో ఆహారం కోసం జనావాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. ప్రజలపై దాడులు చేయడం, చేపలు, తాబేళ్లను తినడం చేస్తున్నాయి. కొలంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనపై అనంత్ అంబానీ స్పందించారు. ఆ హిప్పోలను చంపవద్దని, వాటికి వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో శాశ్వత నివాసం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొలంబియా పర్యావరణ, సుస్థిర అభివృద్ధి శాఖకు అభ్యర్థన పంపారు. ప్రాణం ఉన్న జీవులుగా వాటికి జీవించే హక్కు ఉందని, వాటికి కావాల్సిన అన్ని సదుపాయాలు, సురక్షిత పరిస్థితులను తాము కల్పిస్తామని అనంత్‌ అంబానీ తెలిపారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అనంత్‌ అంబానీ నిర్వహిస్తున్న అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా. ఈ అభయారణ్యం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కొన్ని వేల ఎకరాల్లో ఉంది. ఇందులో రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి. వేటగాళ్ల బారిన పడి గాయపడ్డవి లేదా నిరాదరణకు గురైన జంతువులను వంతారా బృందం రక్షించి వాటికి ప్రత్యేక వైద్య సంరక్షణ, పునరావాస సదుపాయాలు కల్పిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జ్యూస్‌ సెంటర్లలో జ్యూస్‌ తాగుతున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి

అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్

కింగ్‌ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం

రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట

మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *