వాపులను తగ్గిస్తుంది: శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపులు భవిష్యత్తులో క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. బ్రోకలీని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇటువంటి వాపులు తగ్గి, శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.