Silver Chain Astrology Telugu: జ్యోతిష్య శాస్త్రంలో వెండికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వెండిని పవిత్రమైన, శుభప్రదమైన లోహంగా పరిగణిస్తారు. వేద జ్యోతిష్యం ప్రకారం, వెండికి చంద్రుడు, శుక్ర గ్రహాలతో సంబంధం ఉంది. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తే.. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, విలాసం, సుఖసంతోషాలకు కారకుడిగా చెబుతారు. అందుకే వెండిని శాంతి, చల్లదనం, సానుకూలత, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం వెండి గొలుసులు కేవలం ఆభరణాలుగానే కాకుండా ఫ్యాషన్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలామంది తమ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి వెండి గొలుసులను ధరిస్తున్నారు. అయితే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ప్రతి లోహం ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకే వెండి గొలుసు ధరించే ముందు తమ రాశి, జాతకంలోని గ్రహస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తుంటారు.