ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో అందం కోసం, సానుకూల వాతావరణం కోసం మొక్కలను పెంచుతున్నారు. వాటిలో జేడ్ ప్లాంట్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ ప్రకారం, జేడ్ ప్లాంట్ను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం, అదృష్టం, సానుకూల శక్తి చేకూరుతాయని విశ్వాసం. దీనిని మనీ ట్రీ లేదా ఫ్రెండ్షిప్ ట్రీ అని కూడా పిలుస్తారు.