Headlines

Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే


ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి పెట్టిన వేధింపులను తట్టుకోలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలోని దేవనగర్‌కు చెందిన 29 ఏళ్ల అరుణ అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో దేవేంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొన్నాళ్లకు స్నేహంగా మారడంతో ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయి.

అయితే సదరు మహిళకు ఇప్పటికే వివాహం జరిగి భర్త కూడా ఉన్నాడు. కానీ భర్తను వదిలేసి తన వెంట రావాలని అరుణపై దేవేంద్ర ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. అందుకు అరుణ నిరాకరించడంతో దేవేంద్ర ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన వెంట రాకపోతే ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఇక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయిన అరుణ.. దేవేంద్ర పెట్టిన వేధింపులు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నంద్యాల 3 టౌన్ పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలను తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *