Headlines

మరణించిన వ్యక్తి నుంచి వీర్యకణాల సేకరణ.. ఎయిమ్స్‌ వైద్యుల విప్లవాత్మక పరిశోధన!


తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు దూరమైనా.. వారి జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. అవయవదానం ద్వారా మరణించిన వారి అవయవాల్లో తమ ఆత్మీయుల రూపాన్ని చూసుకుంటారు కొందరు. కానీ, చనిపోయిన తర్వాత కూడా వారి వారసత్వాన్ని మరో తరానికి అందించవచ్చంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఇది సాధ్యమయ్యే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. అంతేకాదు, ఇప్పటికే మరణించిన ఓ వ్యక్తి నుంచి విజయవంతంగా వీర్యకణాలను సేకరించి శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. మరణం తర్వాత కూడా తమ సంతానాన్ని ఈ లోకంలోకి తీసుకురావచ్చనే సరికొత్త అవకాశానికి ఇది నాంది పలుకుతోంది.

ఈ సరికొత్త పరిశోదనను మధ్యప్రదేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్యులు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి నుంచి జనీవంగా చలనంలో ఉన్న వీర్యకణాలను సేకరించి వాటి ద్వారా సంతానోత్పత్తి కలిగించవచ్చా అనే అంశాలపై శాస్త్రీయంగా అధ్యనాలు స్టార్ట్ చేశారు. భోపాల్‌ ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం, పాథాలజీ అండ్‌ లాబొరేటరీ మెడిసిన్‌ విభాగాలు కలిసి నిర్వహించిన ఈ అధ్యయనానికి ఐసీఎంఆర్‌ ఆర్థిక సహకారం చేసింది.

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోదకులు 600 మంది నుంచి దాదాపు 250కిపైగా వీర్యకణాలు సేకరించగా.. ఇందులో చనిపోయిన వారి నుంచి కూడా వీర్యకణాలను విజయవంతంగా సేకరించినట్టు తెలిపారు. ఈ పరిశోధనకు జాతీయస్థాయిలో గుర్తింపు కూడా లభించింది.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *