Headlines

Andhra Pradesh: పల్లె పోరులోనూ తగ్గేదేలే.. తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో కూటమి జోరు.. వైసీపీకి ఎన్ని వచ్చాయంటే..?


ఏపీలో గ్రామపోరుకు తొలిదశ పోలింగ్‌ ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. సింబల్స్‌తో సంబంధం లేకుండా జరిగిన ఈ పోరులో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థులు.. భారీ సంఖ్యలో విజయం సాధించారు. తొలి విడతలో మొత్తం 3వేల 949 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలకాగా.. 3వేల240 పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. వీటిలో మూడింట రెండొంతులు పంచాయితీలను కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేనలు గెలుచుకున్నాయి. వైసీపీ మద్దతుదారులు ఆశించినస్థాయిలో ప్రభావం చూపలేదు. భారీ సంఖ్యలో 70శాతానికి పైగా పంచాయతీలను దక్కించుకున్న కూటమి.. స్థానిక ఎన్నికల్లో విజయ పరంపరను కొనసాగించింది.

అంతకు ముందు అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా ముగిసింది. పల్నాడు జిల్లా జొన్నలగడ్డలో, ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. పోలీసుల రంగప్రవేశంతో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఇక రాయలసీమలో లోకల్‌ లీడర్ల పంతాలు, పట్టింపులతో ఒక్కసారిగా హీటు పెరిగింది. నంద్యాల జిల్లా అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడి.. ఉద్రిక్తతకు దారితీసింది. కడపజిల్లా కడప జిల్లా కొండుగారిపల్లెలో, తిరుపతి జిల్లా మంగంపేటలో గొడవలు జరిగాయి. పోలీసులు అలెర్టవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

మున్సిపాలిటీల్లోనూ ముగిసిన పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. తొలివిడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తి కాగా… మిగిలిన స్థానాల్లోనూ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా కందుకూరు స్థానంలో పోలింగ్‌శాతం నమోదు కాగా.. అత్యల్పంగా గూడూరు పట్టణంలో నమోదైంది. ఈ స్థానాలకు సంబంధించి ఫలితాలు ఈనెల 30న విడుదలవుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *