డైరెక్టర్ మురళి కాంత్ దర్శకత్వంలో హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అలియాస్ రుక్మిణి. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తన కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైనదని, మనస్ఫూర్తిగా చేసిన ప్రాజెక్ట్ అని చెప్పారు. ముందుగా నితిన్ మీడియాకు, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రైలర్‌కు లభించిన మంచి స్పందనకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
అలియాస్ రుక్మిణి చిత్రం గురించి మాట్లాడుతూ, “లాస్ట్ కొన్ని సినిమాలు నేను చేసినప్పుడు, వాటికి కొన్ని లెక్కలు వేసుకుని చేశాను. కొన్ని కమర్షియల్ లెక్కలు వేశాను. కానీ ఫస్ట్ టైమ్ ఎలాంటి లెక్కలేసుకోకుండా, డైరెక్ట్ స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్, కథ విన్నాను, నచ్చింది, చేశాను అంతే” అని నితిన్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో పాటలు, డ్యాన్సులు, ఫైట్లు వంటి వాణిజ్య అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం కథను, కంటెంట్‌ను మాత్రమే నమ్మి చేసిన సినిమా అని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
నిర్మాత దీప్తి గారి గురించి మాట్లాడుతూ, ఈ కథను గుర్తించడం నుండి సెన్సార్ పూర్తయ్యే వరకు ఆమె సినిమాకు ఒక పెద్ద పిల్లర్ అని, ఒక తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, దీప్తి గారు ఈ సినిమాను అలాగే చూసుకున్నారని ప్రశంసించారు. ఆర్టిస్టుల ఎంపిక నుండి కాస్ట్యూమ్స్, సెట్స్, లొకేషన్స్, ఎడిటింగ్ వరకు అన్ని విభాగాలలో ఆమె చురుకుగా పాలుపంచుకున్నారని, “మా సినిమాకి షి ఈజ్ లైక్ మా శివగామి” అని దీప్తి గారిని నితిన్ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
సంగీత దర్శకుడు విజయ్ గురించి మాట్లాడుతూ, “ఇవాళ ఏ సినిమా అయినా అది జనాల్లోకి వెళ్లాలంటే ఫస్ట్ సాంగ్స్ బాగుండాలి. మా సినిమాకి రెండు అద్భుతమైన పాటలు ఇచ్చి, ఫస్ట్ గ్లిమ్స్‌తోనే సూపర్బ్ స్కోర్ ఇచ్చి, ఈ సినిమాని హి టుక్ ఇట్ ఇన్ టు ద క్రౌడ్” అని తెలిపారు. ట్రైలర్లో తన ఆర్.ఆర్. (రీ-రికార్డింగ్) కూడా చాలా బాగుందని, ఈ సినిమాకు విజయ్ మొదటి హీరో అని నితిన్ అన్నారు. “సినిమా చూశాక ఈ పాటల్ని మీరు మళ్ళీ మళ్ళీ వింటుంటారు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి నాచురల్ స్టార్ నాని మద్దతు గురించి నితిన్ మాట్లాడుతూ, “కమర్షియల్ మూవీస్ చేస్తున్న నాకు ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమా చేస్తాడు అని నమ్మింది ఫస్ట్ నాని యే” అని, తన కెరీర్లో అత్యుత్తమ సినిమాను ఇచ్చినందుకు నానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరగా, అలియాస్ రుక్మిణి చిత్రం డిసెంబర్ 4న విడుదలవుతుందని నితిన్ ప్రకటించారు. ఇది మనసున్న ఒక సరళమైన చిత్రం అని, ప్రేక్షకులందరూ ఆనందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..