కార్లు, బైకుల బీమా ప్రీమియంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మోటార్ వాహన చట్టంలో గణనీయమైన మార్పులకు సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానం ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు బీమా ప్రీమియం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది వాహనదారులలో క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, భీమా లేని వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు పెట్రోల్ బంకుల్లో ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి, వాటి బీమా వివరాలను తనిఖీ చేస్తాయి. బీమా ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనం అందించబడుతుంది. సుప్రీంకోర్టు కమిటీ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ పైలట్ ప్రాజెక్టు మొదట హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో ప్రారంభమవుతుంది. డ్రైవర్లలో బాధ్యతను పెంపొందించి, రోడ్డు భద్రతను మెరుగుపరచడమే ఈ కఠిన నిర్ణయాల వెనుక ప్రధాన ఉద్దేశ్యం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
CM Chandrababu: ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు