ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణం: పార్ట్ 1 మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ రాబడుతుంది. అలాగే ఆస్కార్ నామినేషన్స్ లోనూ రామాయణం పేరు వినిపిస్తుంది. కాగా ఈ సినిమాకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ప్రశంసలు లభించాయి. చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసిన ఆయన.. సినిమా విజయం పట్ల అభినందనలు తెలిపారు. అయితే ఈ సమావేశంలో అమిత్ షా రామాయణ ఇతిహాసంపై అవగాహనా ఎంతగానో ఆశ్చర్యపరిచిందట. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి, రవి దూబే కీలక పాత్రల్లో నటించారు. విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్ తో తెరకెక్కిన కథనం, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సమావేశంలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ, హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ సాయిపల్లవితో పాటు సహ నిర్మాత నిరజ్ సంఘాయ్ పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రామాయణ ఇతిహాసాన్ని ఇంత భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకొచ్చినందుకు అమిత్ షా చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ భేటీలో అందరినీ ఆకట్టుకున్న విషయం అమిత్ షాకు రామాయణంపై ఉన్న అపారమైన పరిజ్ఞానం. ఆ ఇతిహాసంలోని చారిత్రక అంశాలు, సాంస్కృతిక ప్రాధాన్యత, భారతీయ సంప్రదాయాల్లో దాని స్థానం గురించి ఆయనకు ఉన్న అవగాహన చూసి చిత్ర బృందం ఆశ్చర్యపోయిందట. సినిమా తెరకెక్కించడానికి మేకర్స్ చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
విడుదలైనప్పటి నుంచి ‘రామాయణం: పార్ట్ 1’ ఇండియావైడ్ గానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ విజువల్స్, అద్భుతమైన నిర్మాణ విలువలు, ఎమోషనల్ స్టోరీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఎన్నో ఏళ్ల ప్రణాళిక, కఠినమైన శ్రమ, ఎంతోమంది ప్రతిభావంతుల సమిష్టి కృషితో ‘రామాయణం’ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దేశ హోంమంత్రి అమిత్ షా నుంచి ప్రశంసలు అందుకోవడం నిర్మాత నమిత్ మల్హోత్రాకు మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి