Headlines

చేతులరిగేలా రుద్దక్కర్లేదు.. షర్ట్ పై పడిన టీ, కాఫీ మరకలను ఇలా ఈజీగా తొలగించండి


బట్టలపై మరకలు పడటం సహజం. కొన్నిసార్లు మనం టీ లేదా కాఫీ తాగేటప్పుడు పొరపాటున అది ఒలికి మీద పడిపోవచ్చు. అది మనకు ఇష్టమైన షర్ట్ లేదా ప్యాంట్ పై పడితే.. అది చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకంటే అలాంటి మరకలు అంత త్వరగా వదలవు.. అవి దుస్తువును పూర్తిగా నాశనం చేస్తాయి. ఎన్నిసార్లు ఉతికినా, గట్టిగా రుద్దినా మరక పూర్తిగా పోదు. కానీ సోషల్ మీడియాలో డ్రై క్లీనర్ రిషబ్ రాయ్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. దుస్తులపై పడిన వివిధ రకాల మరకలను సులభమైన చిట్కాలతో ఈజీగా తొలగించవచ్చు.

దుస్తులపై ఇంక్ మరకను ఎలా తొలగించాలి?

మనం రాసేటప్పుడు సడెన్ గా రిఫీల్ ఊడిపోయి ఇంక్ షర్ట్ పై పడిపోవచ్చు. ముఖ్యంగా పిల్లల యూనిఫాంలు, పెద్దలు ఆఫీసుకు వేసుకెళ్లే దుస్తులపై ఇంక్ మరకలు పడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి డ్రై క్లీనర్ పాలను ఉపయోగించాలని రిషబ్ రాయ్ సూచించారు. దీనికోసం మరక పడిన భాగాన్ని పచ్చిపాలలో ముంచి కొంతసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దుస్తులను చేతితో మెల్లగా రుద్ది శుభ్రం చేయాలి. పాలలోని కొవ్వు, ప్రోటీన్లు దుస్తుల దారాల నుంచి సిరాను వదులు చేయడానికి సహాయపడతాయని డ్రై క్లీనర్ తెలిపారు. ఈ చిట్కాను మీరు పాటించి చూడవచ్చు.

లిప్‌స్టిక్ మరకను ఎలా పోగొట్టాలి?

మీ టాప్ లేదా దుస్తులపై లిప్‌స్టిక్ మరక పడితే, దాన్ని తొలగించడానికి ఆల్కహాల్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక శుభ్రమైన గుడ్డ లేదా దూదిపై కొద్దిగా ఆల్కహాల్ తీసుకుని, మరక ఉన్న చోట మెల్లగా రాయాలి. కాసేపటికి అది పూర్తిగా తొలగిపోతుంది.

టీ-కాఫీ మరకలను ఎలా తొలగించాలి?

మీ దుస్తులపై టీ లేదా కాఫీ పడి మరకలు పడితే, వాటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, నీటిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మరక ఉన్న చోట రాసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మెల్లగా తుడిచి, దుస్తులను నీటితో ఉతకాలి.

నూనె మరక పడితే ఏం చేయాలి?

దుస్తులపై నూనె మరకను తొలగించడానికి డిష్ సోప్ అంటే గిన్నెలు తోమే లిక్విడ్‌ను ఉపయోగించవచ్చు. మరక ఉన్న చోట కొద్దిగా డిష్ సోప్ వేసి మెల్లగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఒకేసారి మరక లేదా జిడ్డు పోకపోతే, ఈ ప్రక్రియను మరోసారి చేయవచ్చు.ఇలా కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మీ దుస్తులపై పడిన మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 ధృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *