రోగనిరోధక శక్తికి తోడ్పాటు: చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. క్యారెట్లలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. క్రమం తప్పకుండా మితంగా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తగ్గి, చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.