Headlines

Telangana: ఖమ్మం అబ్బాయి, బ్రిటన్‌ అమ్మాయి ఒక్కటైన వేళ..


విదేశాల్లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి, రెండు దేశాలు, రెండు సంస్కృతులను ఒక్కటిగా చేసింది. ఖమ్మానికి చెందిన భరత్‌, బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్‌ ఆదివారం భారతీయ సంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన భరత్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. 2021లో ఎంఎస్‌ పూర్తి చేసి, అక్కడే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి పెన్షన్‌ శాఖలో కొలువు సాధించారు. అదే శాఖలో పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్‌తో పరిచయం ఏర్పడింది. కలిసి పనిచేస్తున్న క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది.

ఇద్దరూ తమ మనసులోని మాటను కుటుంబ సభ్యులకు చెప్పగా, ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లికి మార్గం సుగమమైంది. దీంతో ఖమ్మం బోనకల్లు రోడ్డులోని ఓ వేడుకల మందిరంలో ఆదివారం హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. రెండు దేశాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో భరత్‌, ఎలిజబెత్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *