Headlines

Weekly Horoscope: ఈ వారం ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆదాయం, ఉద్యోగంలో ఊహించని శుభవార్తలు!


Weekly Rashi Phalalu : మేషం రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. వృషభం రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మిథునం రాశి వారికి ఉద్యోగ జీవితం బాగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. అయితే.. మేషం రాశి మొదలుకొని.. మీన రాశి వరకు.. వార ఫలాలు (నవంబర్ 22-28, 2026) ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారం గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. షేర్లు, స్పెక్యు లేషన్లు బాగా లాభిస్తాయి. సమాజంలో పలుకుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవ హారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి సహకారముంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఉద్యోగ జీవితం బాగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఉద్యోగంలో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఉద్యోగంలో పని భారం, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగా సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూల వుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. కొద్ది మార్పులతో వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉన్నందు వల్ల ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. సొంత పనుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల చదువులు విజయవంతంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. తండ్రి నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొందరు బంధుమిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. పనిభారం పెరిగినా గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమ‍స్యల నుంచి బయటపడతారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొందరు మిత్రులు ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆశించిన హోదా లభించే అవకాశం ఉంది. డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, ఇతర వృత్తి నిపుణుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. కొద్దిపాటి శ్రమతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఉద్యోగంలో భారీ లక్ష్యాలు చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజన కంగా పురోగమిస్తాయి. శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు అరు దైన అవకాశాలు లభిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన వ్యవహారాలను, కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఇంట్లో ఒక శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగించడానికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో సామరస్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయ త్నాల విషయంలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన హోదా లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని, లక్ష్యాల్ని అందుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజ యవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతూ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామి విషయంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యో గులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు., ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కొన్ని ప్రత్యేక లక్ష్యాలను అప్పగించడం జరు గుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం అవసరం. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కొన్ని వ్యక్తి గత, కుటుంబ సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దైవకార్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదనలకు దిగవద్దు. ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. హోదా పెరిగే సూచనలున్నాయి. పని భారం, ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో బాగా జాగ్రత్తగా ఉండడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *