Headlines

Viral Video: ఇకపై బైక్ రైడర్లకు కూడా ఎయిర్‌బ్యాగులు వస్తున్నాయా? ఈ వీడియో నిజమేనా?


Viral Video:బైక్‌పై ప్రయాణించేటప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ఎంతో ముఖ్యం. అయితే హెల్మెట్ నుంచే ఒక పెద్ద ఎయిర్‌బ్యాగ్ బయటకు వచ్చి బైకర్ శరీరమంతా కవర్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. చైనాలో ఈ సరికొత్త టెక్నాలజీని తయారు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నది నిజమైన ఆవిష్కరణేనా? దీని వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం.

హెల్మెట్ నుంచి బయటకు వచ్చిన భారీ ఎయిర్‌బ్యాగ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ బైకర్ రోడ్డుపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడతాడు. అయితే అతడు నేలను తాకే సమయంలోనే హెల్మెట్ నుంచి భారీ ఎయిర్‌బ్యాగ్ బయటకు వస్తుంది. క్షణాల్లోనే అది బైకర్ శరీరమంతా చుట్టుముడుతుంది. ప్రమాదాల సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ ఎలా తెరుచుకుంటాయో.. అదే తరహాలో ఈ వ్యవస్థ పనిచేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రమాద సమయంలో బైకర్ శరీరానికి, రోడ్డుకు మధ్య రక్షణ కవచంలా పనిచేసి గాయాల తీవ్రతను తగ్గించడమే దీని ఉద్దేశంగా చూపించారు.

చైనా కంపెనీల పేర్లతో ప్రచారం

ఈ టెక్నాలజీని చైనాకు చెందిన Lanxi Yema Motorcycle Fittings, Yanfeng Automotive కంపెనీలు అభివృద్ధి చేసినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ప్రచారం జరుగుతోంది. లాన్సీ యేమా హెల్మెట్ల తయారీ సంస్థ కాగా, యాన్‌ఫెంగ్ ఆటోమోటివ్ కార్లకు సంబంధించిన ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్స్ వంటి భద్రతా పరికరాలను తయారు చేస్తుంది. అయితే ఈ రెండు కంపెనీలు వైరల్ వీడియోలో కనిపిస్తున్న పూర్తి శరీరాన్ని కప్పే ఎయిర్‌బ్యాగ్ హెల్మెట్‌ను తయారు చేసినట్లు అధికారిక ప్రకటన చేయలేదు. దీనికి సంబంధించిన ఉత్పత్తి వివరాలు, భద్రతా ధ్రువీకరణ పత్రాలు కూడా అందుబాటులో లేవు.

అసలు ఇది నిజమైన టెక్నాలజీనా? AI వీడియోనా?

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న హెల్మెట్‌పై చైనీస్ కంపెనీ లోగోకు బదులుగా ఇటలీకి చెందిన ప్రముఖ AGV బ్రాండ్ లోగో కనిపిస్తోంది. అలాగే బైకర్ ధరించిన రైడింగ్ సూట్ కూడా ఇటలీకి చెందిన Dainese బ్రాండ్‌దిగా గుర్తించారు. మరోవైపు, ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో వీడియోలో అనేక అసంబద్ధమైన మార్పులు కనిపించాయి. ఉదాహరణకు, బైకర్ మోకాలి ప్యాడ్ రంగు మారడం, ఎయిర్‌బ్యాగ్ బయటకు వచ్చిన తర్వాత చేతి కనిపించకుండా పోవడం వంటి లోపాలు గుర్తించారు. అనేక AI డిటెక్షన్ టూల్స్ కూడా ఈ వీడియో AIతో రూపొందించినదిగా గుర్తించాయి. దీంతో ఇది నిజమైన చైనా కంపెనీ ఉత్పత్తి పరీక్షకు సంబంధించిన వీడియో కాదని ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది ఈ వీడియో చూసిన చాలామంది ఇది నిజంగా అందుబాటులోకి వస్తే బైక్ ప్రయాణాలు మరింత సురక్షితంగా మారతాయని కామెంట్లు చేస్తున్నారు.

బైకర్ల కోసం ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ నిజంగానే ఉందా?

అవును. బైకర్ల భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో బైకర్లు ప్రమాద సమయంలో ఆటోమేటిక్‌గా తెరుచుకునే ఎయిర్‌బ్యాగ్ జాకెట్లు, వెస్టులను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు.. 2022లో ఇటలీకి చెందిన AIROH కంపెనీ, స్వీడన్‌కు చెందిన Autoliv సంస్థ కలిసి ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీతో కూడిన హెల్మెట్ ప్రోటోటైప్‌ను పరిచయం చేశాయి. అయితే అది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని పూర్తి శరీరాన్ని కప్పే ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థకు భిన్నమైనది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *