Headlines

EPFO: శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే నిమిషాల్లోనే ప్రాబ్లం క్లియర్..


మీరు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే మీ కంపెనీ ప్రతీ నెలా మీ జీతం నుంచి 12 శాతం చొప్పున కట్ చేసి మీ పీఎఫ్ అకౌంట్లో వేస్తూ ఉంటుంది. అలాగే కంపెనీ అదనంగా మరో 12 శాతం సొమ్ము నిబంధనల ప్రకారం మీ పీఎఫ్ ఖాతాలో యాడ్ చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ముందు నెల జీతానికి సంబంధించిన పీఎఫ్ నగదును తర్వాతి నెల 15వ తేదీలోపు ఖచ్చితంగా వేయాలి. అయితే కొన్నిసార్లు మీ జీతం నుంచి కట్ చేసినా వాటిని మీ కంపెనీ యాజమాన్యం జమ చేయడంలో ఆలస్యం చేయవచ్చు. లేదా ఎన్ని నెలలు అయినా వాటిని వేయకుండా అలాగే తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్‌కు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం.

మీ కంపెనీ జీతం నుంచి కట్ చేసి సొమ్మును పీఎఫ్ ఖాతాలో వేయలేదా..? కట్ చేసిన అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ వేశారా? అయితే మీరు టెన్షన్ పడనక్కర్లేదు. సులువుగా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసి ఈపీఎఫ్ఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీంతో అధికారులు స్పందించి మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఆలస్యంగా జమ చేసినందుకు యాజమాని అధిక వడ్డీ చెల్లించాల్సి రావడంతో పాటు పెనాల్టీ కూడా వేసే అవకాశముంటుంది. సరైన సమయంలో జమ చేయడం ద్వారా మీకు అందే వడ్డీ, పెన్షన్‌పై ఎలాంటి ప్రభావం పడదు. అలాగే ఆర్ధిక పరిస్థితుల్లో మీ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

ఇలా ఫిర్యాదు చేయండి..

మీ కంపెనీ పీఎఫ్ డబ్బులు వేయడంలో ఆలస్యం చేస్తుంటే ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ పోర్టల్ EPFiGMS ఓపెన్ చేసి ఫిర్యాదు చేయండి. ప్రూఫ్ కింద మీ పేస్లిప్స్, ఈపీఎఫ్ఓ పాస్ బుక్, ఇతర స్టే్ట్‌మెంట్లు సమర్పించండి. ఆలస్యం కావడం వల్ల ఉద్యోగికి జరిగే నష్టాలకు కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

-ముందుగా https://epfigms.gov.in/ పోర్టల్ తెరవండి

-హోమ్ పేజీలో రిజిస్టర్ గ్రీవెన్స్ ఆప్షన్ ఎంచుకోండి

-పీఎఫ్ మెంబర్, పెన్షనర్, ఇతర కేటగిరీలో మీకు తగిన ఆప్షన్ ఎంచుకోండి

-అనంతరం మీ యూఏఎన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి

-మీ సమస్య, ఇతర వివరాలను నమోదు చేసి సమర్పించండి

-అవసరమైన ఆధారాలను అప్‌లోడ్ చేయండి

-సబ్మిట్ చేయగానే మీ వివరాలు ఈపీఎఫ్ఓకు అందుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *