Headlines

వార్డు నామినేషన్‌కే ఇలా చేస్తే.. సర్పంచ్ టికెట్ ఇస్తే హెలికాప్టర్ ఎంట్రీ అనుకుంట..


వార్డు నామినేషన్‌కే ఇలా చేస్తే.. సర్పంచ్ టికెట్ ఇస్తే హెలికాప్టర్ ఎంట్రీ అనుకుంట..

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం మొదలుపెడుతున్నారు. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి నామినేషన్ ర్యాలీ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుర్రాలపై ఊరేగింపుగా రావడంతో పాటు, సినీ హీరో పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని సన్నివేశాన్ని అనుకరించి సందడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 13వ వార్డు నుంచి పోటీ చేస్తున్న చీపురువలస గ్రామానికి చెందిన లెంక సూరిబాబు నామినేషన్ దాఖలు చేసేందుకు వినూత్నంగా బయలుదేరారు. తన స్వగ్రామం నుంచి అనుచరులు, గ్రామస్థులతో కలిసి ఊరేగింపుగా కొత్తవలసకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాధారణంగా అభ్యర్థులు కార్లు, బైక్‌లతో ర్యాలీగా నామినేషన్ కేంద్రాలకు వస్తుంటే.. సూరిబాబు మాత్రం గుర్రాల ఊరేగింపుతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇక ఈ ర్యాలీలో మరో ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని అనుకరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. గుర్రాల ఊరేగింపు, సినిమా సన్నివేశం అనుకరణతో అక్కడ సందడి నెలకొంది.

ఈ వినూత్న ర్యాలీని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో సూరిబాబు నామినేషన్ ఊరేగింపు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు కొత్త పంథాలు ఎంచుకుంటుండగా.. కొత్తవలసలో గుర్రాలపై సాగిన ఈ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *