Headlines

చలికాలంలో హెయిర్ గ్రోత్ స్లో అవుతోందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే !!


చలికాలంలో హెయిర్ గ్రోత్ స్లో అవుతోందా.. అయితే ఈ టిప్స్ మీకోసమే !!

చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువమంది భయపడే విషయం జుట్టు రాలడం. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా.. నేటి కాలంలో జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి. మరి ముఖ్యంగా వింటర్ సీజన్ మొదలైనప్పటినుంచే రెగ్యులర్‌గా నూనె రాస్తున్నా.. కండీషనర్లు వాడుతున్నా కూడా దువ్వెనతో జుట్టును సరిచేసిన ప్రతిసారి జుట్టు ఊడిపోతూనే కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే చలికాలంలో జుట్టు పెరుగుదల ఎందుకు ఆగిపోతుంది? కురులు పొడిబారి చిట్లిపోకుండా ఏం చేయాలి? అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా..

చలికాలంలో జుట్టు పెరుగుదల తగ్గడానికి కారణం..

అయితే చలికాలంలో జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోదని.. కానీ చాలా నెమ్మదిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. చల్లని గాలి వల్ల తల చర్మంలోని (Scalp) రక్తనాళాలు కుచించుకుపోతాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు తగ్గిపోతాయని క్లారిటీ ఇస్తున్నారు. ఇక వీటికి తోడు శరీరంలో జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్-డి లోపం కూడా పెరుగుదల తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. కాగా చలికాలంలో ధరించే ఉన్ని టోపీలు (Woolen caps), స్కార్ఫ్‌ల రాపిడి వల్ల జుట్టు చిక్కులు పడి మధ్యలోనే తెగిపోవచ్చని కూడా అంటున్నారు. అంతేకాకుండా హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, స్ట్రెయిట్‌నర్లు వాడటం, రోజూ తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు మరింత నిర్జీవంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

జుట్టు పెరుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేడినీటితో స్నానం : చలిగా ఉందని మరీ వేడినీళ్లతో తలస్నానం చేస్తే జుట్టులోని సహజ నూనెలన్నీ పోతాయి. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీటినే వాడాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.

రోజూ 10 నిమిషాల మసాజ్: రోజూ గోరువెచ్చని కొబ్బరి నూనె, ఆముదం లేదా ఆర్గాన్ ఆయిల్‌తో తలకు 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు కుదుళ్లు బలపడతాయి.

మాయిశ్చరైజింగ్ షాంపూ, హెయిర్ మాస్క్: సల్ఫేట్, పారాబెన్ లేని షాంపూలను ఎంచుకోవాలి. గ్లిజరిన్, హయలురోనిక్ యాసిడ్, షియా బటర్ ఉన్న కండీషనర్లు వాడాలి. వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ హెయిర్ మాస్క్ వేసుకుని అరగంట తర్వాత కడిగేయడం వల్ల జుట్టుకు మంచి తేమ అందుతుంది.

హెయిర్ సీరమ్ : తలస్నానం తర్వాత జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడే చివర్లకు హెయిర్ సీరమ్ రాయాలి. ఇది బయటి పొడిగాలి నుంచి జుట్టును కాపాడుతుంది. అలాగే ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టు చివర్లను కత్తిరించుకోవడం వల్ల చిట్లిపోయే సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

పోషకాహారం & నీరు: జుట్టు పైపూతలతో పాటు లోపలి నుంచి బలంగా ఉండాలంటే ఆహారంలో బయోటిన్, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, ఆకుకూరలు, చేపలు, అవకాడో వంటివి తరచూ తీసుకోవాలి. దాహం వేయకపోయినా రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి.

(గమనిక: ఒకవేళ విపరీతంగా జుట్టు ఊడిపోతున్నా, తలపై ప్యాచెస్ లాగా బట్టతల కనిపిస్తున్నా, చుండ్రు మరీ ఎక్కువైనా సొంత చిట్కాలు మానేసి వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *