నెయ్యి సున్నుండలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వీటిని పొట్టు లేని మినపప్పు, బెల్లం లేదా పంచదార పొడి, అర టేబుల్ యాలకుల పొడి, స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి. మరి, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు : మినపప్పు లేదా మినపగుళ్లు రెండు కప్పులు పొట్టు లేనివి తీసుకోవాలి. ఇంకా దీనిలో మీరు కొంచం బియ్యం కూడా కలిపి వేసుకోవచ్చు. బెల్లం లేదా పంచదార పొడి 1 కప్పు తీసుకోవాలి. ఇంకా అర కప్పు నెయ్యి సుమారు కరిగించి కొద్దిగా గోరువెచ్చగా ఉండేది వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకోవాలి.
నెయ్యి సున్నుండలు తయారి విధానం : ముందుగా మినపప్పును వేయించుకోవాలి: మినపప్పును తీసుకుని మీడియం మంటపై దీనిని మంచి సువాసన వచ్చే వరకు గరిటెతో రెండు, మూడు సార్లు తిప్పుతూ రంగులోకి మారే వరకు వీటిని బాగా వేయించి ఆ తర్వాత కొంచం సేపు ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి
నెయ్యి సున్నుండలు తయారి విధానం స్టెప్ 1 : పిండిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన పప్పు తీసుకుని దీనిలో 5 యాలకులు వేసి దీనిని మెత్తని పిండిలా చేసుకుని మెత్తటి పిండిలాగా దీనిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మీరు పంచదార తీసుకుంటే అది కలిపి ఇంకోసారి తిప్పాలి.
నెయ్యి సున్నుండలు తయారి విధానం స్టెప్ 3 : వీటిని ఉండలుగా చుట్టుకోవాలి. ఇంకా మీరు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, దానిలో వేడి చేసి పెట్టుకున్న నెయ్యి కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండి వేడి మీద ఉన్నప్పుడే నిమ్మకాయ సైజంతా సున్నుండలు చుట్టుకోవాలి




