Headlines

రియల్ స్టార్ శ్రీహరి ఇంట.. పెళ్లి సందడి..


టాలీవుడ్‌లో రియల్ స్టార్‌ దివంగత నటుడు శ్రీహరి కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడంతో శ్రీహరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ విషెస్ చెబుతున్నారిప్పుడు. శ్రీహరి, ఆయన భార్య నటి డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన శశాంక్ శ్రీహరి ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంజన అనే యువతితో ఆయన వివాహం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇరు కుటుంబాలకు చాలాకాలంగా పరిచయం, సాన్నిహిత్యం ఉండటంతో పెద్దలు ఈ సంబంధాన్ని కుదిర్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పనులకు కూడా శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న శశాంక్, సంజనల నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్

Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!

Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్

సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్‌! ఇంట్రెస్టింగ్‌గా సాత్విక స్టోరీ!

Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్‌ రోజూ కష్టపడుతున్నాడట!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *