Headlines

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..


Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..

ఆసియా గేమ్స్‌లో వరుస స్వర్ణాలతో భారత్ దూసుకుపోతుంది. తాజాగా మహిళల 400 మీటర్ల రిలేలో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. మంగళవారం జరిగిన మహిళల 4 x 400 మీటర్ల రిలే రేసులో భారత ఈ పథకాన్ని కైవసం చేసుకుంది. భారత జట్టులోని నలుగురు రన్నర్లు కిరణ్, మచెట్టిర పూవమ్మ, ప్రాచీ, విద్యా రామ్‌రాజ్ భారత్ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చారు.

మొత్తం 400 వందల మీటర్ల రేసును వీరు కేవలం 3 నిమిషాల 29.69 సెకన్ల సమయంలోనే పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచారు. ఇక 3:30.21 సెకన్లలో ఈ రేస్‌ను పూర్తిన చేసిన బహ్రెయిన్ రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక 3:31.02 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసినా చైనా జట్టు మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *