తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురువు అక్టోబర్ 31 వరకు ఉచ్ఛ స్థితిలో ఉండడం, షష్ట స్థానంలో శనీ శ్వరుడి వక్ర సంచారం, తులా రాశిలో శుక్ర, బుధుల యుతి వల్ల ఈ రాశివారు అతి కొద్ది ప్రయ త్నంతో విదేశీ ఉద్యోగాలు సైతం సాధించగలుగుతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లినిశ్చయం కావడం జరుగుతుంది.