Headlines

Gift Tax: బంధువులు ఇచ్చిన గిఫ్ట్‌పై పన్ను కట్టాలా? ఐటీఏటీ చెన్నై సంచలన తీర్పు!


Gift Tax: పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ అవసరాలు వంటి సందర్భాలలో బంధువులు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. కొన్నిసార్లు ఆ బహుమతి నగదు రూపంలో కూడా ఉండవచ్చు. ఇటీవల ఒక వ్యక్తికి అతని బంధువు రూ. 85 లక్షల నగదు బహుమతిని ఇచ్చారు. కానీ, బహుమతి ఇచ్చిన వ్యక్తి ఆదాయం తక్కువ. ఈ కారణంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా ఇవ్వగలిగారనే దానిపై ఆదాయపు పన్ను అధికారికి అనుమానం వచ్చి, నోటీసు జారీ చేశారు.

ఓ కేసు వివరాలను పరిశీలిస్తే.. బంధువులు కలిసి 85 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు. దీని తరువాత పన్ను అధికారి బహుమతి ఇచ్చిన వారి ఆదాయాన్ని సరిచూశారు. అంటే, 30 లక్షల రూపాయల నగదు ఇచ్చిన బంధువు వార్షిక ఆదాయం 7 లక్షలు అని తేలింది. అంత పెద్ద మొత్తంలో డబ్బును బహుమతిగా ఎలా ఇవ్వగలరని అధికారి ప్రశ్నించి, ఒక నోటీసు పంపారు. అధికారి ఈ డబ్బును ‘వివరించలేని నగదు’ (Unexplained Cash) అని కూడా పేర్కొన్నారు. ఈ నోటీసుకు వ్యతిరేకంగా పన్ను చెల్లింపుదారుడు కేసు దాఖలు చేశారు.

తన బంధువులు తనకు బహుమతులు ఇచ్చారని వాది ధృవీకరించాడు. అందుకుగాను అతను సాక్ష్యాలను సమర్పించాడు. అతను వారి ఆదాయపు పన్ను రిటర్నులన్నింటినీ, బ్యాంకు ఖాతా వివరాలను సక్రమంగా దాఖలు చేశాడు.

ఇవి కూడా చదవండి



ITAT తీర్పు:

బహుమతి ఎవరు ఇచ్చారో రుజువైంది. బహుమతి ఇచ్చిన బంధువు తన పాత పొదుపు, ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు లేదా ఇతర చట్టబద్ధమైన మార్గాల నుండి ఆ బహుమతిని ఇచ్చి ఉంటే, అది చెల్లుబాటు అవుతుంది. అందుకోసం ఆదాయపు పన్ను అధికారి అతని తక్కువ వార్షిక ఆదాయం అనే కారణంతో అతని ఆదాయపు పన్ను రిటర్న్ ఆధారంగా ఆ బహుమతిని చెల్లనిదిగా ప్రకటించలేరు. అంతేకాకుండా, బహుమతి ఇచ్చేవారి నుండి ఆ డబ్బు ఎలా వచ్చిందనే దానిపై ఏమైనా అనుమానం ఉంటే, వారిపై విచారణ జరపవచ్చు. కానీ బహుమతిని అందుకున్న వారిని పన్ను చెల్లించమని అడగకూడదు.

గుర్తించుకోవాల్సిన విషయాలు:

ఈ కేసు తీర్పు నుండి మనం నేర్చుకోగల ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం.

1. మీకు బంధువుల నుండి నగదు బహుమతి లభిస్తే మీరు సరైన బహుమతి వివరాలను రాసుకోవాలి.

2. మీకు బహుమతి ఇచ్చిన వారి పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఐటీఆర్ ఫైలింగ్‌ల కాపీలను మీరు భద్రపరచుకోవాలి.

3. నగదు రూపంలో కాకుండా బ్యాంకు ద్వారా కొనడం మంచిది.

ఇది కూడా చదవండి: Odisha: మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! నదిలో 30 కి.మీ కొట్టుకుపోయి.. 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

ఇది కూడా చదవండి: Gold Buying: దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *