నటి రోజా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకే ఒక్క సినిమా చేసి సినీ రంగం నుండి తప్పుకోవాలనుకున్న ఆమె, పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలతో తనను తాను నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నారు. డ్యాన్స్ రాదు, ఇండస్ట్రీలో పనికిరాదు అంటూ వచ్చినప్పుడు హర్ట్ అయ్యానని, నువ్వేం పెద్ద హీరోయిన్‌వా, అందగత్తెవా.? వంటి చిన్న చిన్న మాటలు తనలో పట్టుదలను పెంచాయని రోజా గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులను ఒప్పించి తనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వారే, ఆ తర్వాత అవమానించడం బాధించిందని ఆమె తెలిపారు.
అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా
ఈ పట్టుదలతోనే రోజా తనను తాను నిరూపించుకుని, అనతికాలంలోనే అగ్రతారగా ఎదిగారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. చెంబరత్తి ఆమె మొదటి హిట్ కాగా, సూర్యన్, రజినీకాంత్‌తో కలిసి నటించిన ఉళైప్పాలి వంటి చిత్రాలు ఆమెను స్టార్‌డమ్‌కి చేర్చాయి. ఐదు భాషల్లో నటించిన ఆమె, హిందీలో మాత్రం ఒక పాట మాత్రమే చేశారు. ప్రేమలో ఉన్న తన భర్త, హిందీ చిత్రాలకు వెళ్తే తిరిగి రానని భయపడి, అక్కడికి వెళ్లనివ్వలేదని ఆమె సరదాగా పంచుకున్నారు. ఆయన అప్పటికే తన మొదటి షెడ్యూల్‌లోనే ప్రేమలో పడ్డారని, అందుకే హిందీ వద్దని చెప్పారని తెలిపారు.
నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!
రోజా తన కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాలలో బాలకృష్ణతో కలిసి నటించిన భైరవ ద్వీపంను ప్రస్తావించారు. ఆ చిత్రం తన డ్రీమ్ క్యారెక్టర్ అని, అందులో నటించడం ఒక విభిన్నమైన అనుభూతి అని తెలిపారు. సాధారణ జీవితానికి పూర్తి విరుద్ధమైన నడవడిక, దుస్తులు, సంభాషణలు ఆ పాత్రకు అవసరం అయ్యాయని, నటన ఎలా చేయాలో, ఎలా సిద్ధం కావాలో ఏమీ తెలియని తను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పినట్లు చేశానని చెప్పారు. బాలకృష్ణకు ఇటువంటి పాత్రలు కొత్త కాదని, తన తండ్రి చిత్రాలు చూసి పెరిగినందున ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. అయితే తాను మాత్రం ఒక షాట్ చేసేటప్పుడు బాలకృష్ణతో సహా యూనిట్ మొత్తం కెమెరా వెనుక నిలబడి తనను కావాలని టీజ్ చేసేవారని, “రోజా సిగ్గుపడుతోంది రండిరా చూద్దాం” అని చెప్పేవారని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.