Virat Kohli World Cup: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెరీర్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ టోర్నీల్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన ఆయనకు కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం, 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాయి. తాజాగా జియోహాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ 2023 ఫైనల్ గురించి మాట్లాడాడు. ఆ మ్యాచ్‌లో 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ శతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. 140-150 పరుగులు చేస్తే భారత్ విజయానికి బలమైన స్థితిలో ఉంటుందని భావించినట్లు వెల్లడించాడు. కానీ పాట్ కమిన్స్ (Pat Cummins) బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో ఆ ప్రణాళిక అక్కడే ఆగిపోయింది.
2023 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా సాగిందని కోహ్లీ పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఒకరి కోసం మరొకరు ఆడుతున్న భావన ఉండేదని చెప్పాడు. ఫైనల్‌లో కూడా అదే నమ్మకంతో బ్యాటింగ్ కొనసాగించిన ఆయన, తన స్కోరును భారీ శతకంగా మలచాలని అనుకున్నాడు.
ఎక్కువమంది చదివినది: నా టార్గెట్ ఫిక్స్.. అందుకోసం అడ్డొచ్చినోళ్లను తొక్కి పడేసుడే.. విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇవి కూడా చదవండి
అయితే 63 బంతుల్లో 54 పరుగుల వద్ద కోహ్లీ వికెట్ కోల్పోయాడు. ఆ సమయంలో అనుకున్న భారీ స్కోరు సాధించలేకపోవడం చాలా రోజుల పాటు తనను బాధించిందని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఒకసారి ఆ క్షణం గుర్తొస్తే దాని గురించే ఆలోచన కొనసాగేదని వివరించాడు.
2019 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమినీ కోహ్లీ మరచిపోలేదు. వర్షం కారణంగా రెండు రోజులకు సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. రెండో రోజు న్యూజిలాండ్ బౌలర్లు కొత్త బంతితో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు. భారత్ 18 పరుగుల తేడాతో ఓడింది. ఆ పరాజయం తనను తీవ్రంగా కలచివేసిందని కోహ్లీ చెప్పారు.
ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్
2027 వన్డే ప్రపంచకప్ తనకు మరో ప్రత్యేక సవాలుగా ఉండబోతుందని కోహ్లీ గతంలో వెల్లడించారు. ప్రపంచకప్‌లో తన పని ఇంకా పూర్తయిందనే భావన తనకు లేదని తెలిపారు. విభిన్న ప్రత్యర్థులు, మైదానాల్లో ఆడటం ప్రతిసారి కొత్త సవాలేనని, అందుకు అనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..