Parrots: తాళ్ళరేవు మండలం చిన్న బొడ్డు వెంకటాయ్యపాలెంలో ఒక ఇంటి మిద్దె పై రామ చిలుకలు సందండి చేస్తున్నాయి. పక్షులలో రామ చిలుకలది ప్రత్యేక స్థానం. సాధారణంగా ఒకటి రొండు కనబడితేనే ఎంతో అనందంగా చూస్తాము. అలాంటిది ఒక ఇంటి మిద్దెపై వందలాది రామ చిలుకలు సందడి చేస్తే రొండు కళ్ళు సరిపోవు కదా.. అసలు అన్ని రామ చిలుకలు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలిసికుందాం.. వాడ్రేవు బాలకృష్ణ ఇంటి వద్ద దాన్యపు కుచ్చులు కట్టడం తో వాటిని తినడానికి ఒకటి రొండు రామ చిలుకలు వచ్చేవి.
అవి క్రమంగా పెరిగి వందల సంఖ్యలో రామ చిలుకలు రావడం మొదలు పెట్టాయి. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న బాలకృష్ణ తన సంపాదన అంత అంత మాత్రమే అయినా కొంత రామ చిలుకల ఆహారానికి ఖర్చు చేయడం ఆదర్శంగా నిలుస్తుంది. మొదట కేజీ దాన్యపు గింజలతో మొదలు పెట్టి ఇప్పుడు 5 కేజీ ల వరకు దాన్యం రోజు మూడు పూటలు నానబెట్టి పెడుతున్నాడు అవే కాకుండా జామపళ్ళు, యాపిల్ వంటివి ఆహారం గా వేస్తున్నారు.
స్వతహాగా పక్షుల ప్రేమికుడైన బాలకృష్ణ కుటుంబం అంతరించుకు పోతున్న రామ చిలుకలను రక్షించడం పై పలువురు ఆ కుటుంబాన్ని అభినందిస్తున్నారు. ఆటో డ్రైవర్ బాలకృష్ణ కు రామచిలుకల పోషణ కష్టం గానే ఉందని వారికి ఎవ్వరైనా పక్షి ప్రేమికులు ధాన్యం, పళ్ళు రూపంలో సహాయం చేస్తే ఎంతో బాగుంటుందని ఆయన పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి