ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డులకు చారిత్రక శుభవార్తను అందించింది. ఏళ్ల తరబడి రాష్ట్ర ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తూ, కుటుంబాలను పోషించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న హోంగార్డుల కృషికి గుర్తింపుగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాల్లో హోంగార్డులకు ఏకంగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది హోంగార్డులకు పెద్ద ఊరట లభించింది. తక్కువ వేతనాలతో, ఎలాంటి కచ్చితమైన ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న వారికి ఇది శాశ్వత ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి 100 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులలో 10 పోస్టులు అర్హులైన హోంగార్డులకే కేటాయిస్తారు. మాజీ సైనికులు, క్రీడాకారుల వంటి ఇతర ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్లకు ఎటువంటి భంగం కలగకుండా ఈ అదనపు ప్రయోజనం హోంగార్డులకు దక్కనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం హోంగార్డుల కుటుంబాల్లో కొత్త ఆశలను నింపింది.
మరిన్ని వీడియోల కోసం :
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?
నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?
ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే సూపర్ మూవీస్ ఇవే
చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!